ప్రస్తుతం చాలా మంది కాళ్లకు నల్ల దారం కట్టుకుని ఉంటారు.
పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే తేడా లేదు చాలా మంది కాళ్లలో మనం రోజూ చూస్తూ ఉంటాం.
కాళ్లకు నల్ల దారం కట్టుకోకూడని రాశులివే! అవి మేష రాశి,వృశ్చిక రాశి, ధనుస్సు రాశి,మీన రాశి
కుజుడికి, శనికి మధ్య వైరం అని చెబుతారు. కాబట్టి ఈ మేష రాశి వారు నల్ల దారం కట్టుకుంటే కుజుడి శుభ ఫలితాలు తగ్గి, ప్రతికూల ఫలితాలు పెరిగే అవకాశం ఉందంట.
ఈ వృశ్చిక రాశికి కూడా అధిపతి కుజుడే. మేష రాశి వాళ్ల లాగే ఈ వృశ్చిక రాశి వారు కూడా నల్ల దారం కట్టుకోవడం వల్ల కుజుడి యొక్క సానుకూల ప్రభావం తగ్గి.. ప్రతికూల ప్రభావం పెరుగుతుందని చెబుతారు.
ఇక ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ గురువు జ్ఞానం, సంపద మరియు అదృష్టానికి ప్రతీకగా చెబుతారు.ఈ గురువుకు నలుపు రంగు శుభప్రదం కాదట.
ఈ నల్ల దారం నలుపు రంగు కాబట్టి దీన్ని ధరించడం వల్ల గురువు అనుకూల ప్రభావం తగ్గి, ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా కొంత ఆటంకం ఏర్పడవచ్చని నమ్మకం.
ఈ మీన రాశి అధిపతి కూడా గురువే కావడంతో.. ధనుస్సు రాశికి వర్తించినట్లే.. ఈ మీన రాశి వాళ్లు నల్ల దారం కాలికి కట్టుకుంటే.. గురువు యొక్క సానుకూల ప్రభావాలు కొంత తగ్గుతాయట.