తిరుమల శ్రీవారి ఆలయంపై  వైసీపీ కుట్రలు

కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఫేక్ ప్రచారం

తిరుమలలోని కౌస్తుభం గెస్ట్‌హౌస్ ప్రహరీ వద్ద మద్యం సీసాలు లభ్యమవడం సంచలనంగా మారింది.

మద్యం సీసాలను వైసీపీ సానుభూతిపరులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు.

తిరుమలలో అపచారం, అరాచకం అంటూ టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది.

పోలీసులకు చెందిన గెస్ట్‌హౌస్ వద్దే ఈ సీసాలు కనిపించడంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

టీటీడీ, పోలీస్‌శాఖ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కార్యకర్తలు, జగన్ మీడియా కుట్రకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. 

తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్తలు ఆళ్లపాక కోటి, నవీన్‌, ఫోటోగ్రాఫర్ మోహన్‌పై కేసు నమోదు చేశారు. 

కోటి, మోహన్‌ కృష్ణను పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న నవీన్ కోసం గాలిస్తున్నారు. 

టెక్నికల్ ఆధారాలతో సహా దొరికిపోయాక కూడా తప్పుడు ప్రచారం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి కవరింగ్ ఇస్తున్నారు.