కొండగట్టు ఆంజనేయస్వామిని  దర్శించుకున్న డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్

ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు.

వాయుపుత్ర సదన్ ధర్మశాల, దీక్ష విరమణ మండపానికి పవన్ భూమి పూజ చేశారు.

కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని పవన్ అన్నారు.

గతంలో విద్యుత్ ప్రమాదం నుంచి కొండగట్టు అంజన్నే తనను కాపాడారన్నారు. 

అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని తెలిపారు.

టీటీడీ, తెలంగాణ నేతల సమిష్టి కృషితోనే ధర్మశాల నిర్మాణం విషయంలో ముందడుగుపడిందని పవన్ అన్నారు.

టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

పర్యటనలో భాగంగా బృందావనం రిసార్ట్‌లో సర్పంచ్‌లు, జనసేన కార్యకర్తలతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు.

పవన్ రాక సందర్భంగా కొండగట్టులో భద్రత కట్టుదిట్టం చేశారు.