కేసీఆర్, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్

కేసీఆర్‌ అసెంబ్లీకి రాకపోవడాన్ని కవిత తప్పుబట్టారు

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానాలు చెప్పకపోతే బీఆర్‌ఎస్ పని ఖతమన్నారు.

కేసీఆర్‌ మీద సీఎం రేవంత్ భాష సరికాదన్నారు.

కేసీఆర్‌ను ఒకసారి ఉరితీయాలంటే.. రేవంత్‌ను పదిసార్లు ఉరితీయాలన్నారు.

హరీష్‌రావుపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

హరీష్ రావు బచ్చా అని.. ప్యాకేజీలు తీసుకోవడం తప్ప ఏం తెలుసన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్‌ఎస్‌కు తనకు సంబంధం లేదని..  ఇక ముందు ఉండబోదని స్పష్టం చేశారు.

గత నాలుగు నెలలుగా కేసీఆర్‌తో మాట్లాడలేదని కవిత తెలిపారు.