తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీకి వచ్చారు.

ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

కేసీఆర్ సీటు వద్దకు వెళ్లిన రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆప్యాయంగా పలకరించి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు.

అనంతరం మంత్రులు సైతం కేసీఆర్‌ను వరుసగా కలిశారు.

సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.

మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు బయటికి వెళ్లిన కేసీఆర్.. నందినగర్‌ నివాసానికి వెళ్లిపోయారు.