పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 

డిసెంబర్ 19వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి.

ఈ సమావేశాలకు ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగనుంది.

పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరనుంది.

పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంపై చర్చించనున్నారు.

ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'పై మాట్లాడనున్నారు.

పది కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పది కీలక బిల్లులపై చర్చించి అమోదించే అవకాశాలు ఉన్నాయి.