ఏవియేషన్‌ రంగంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లో ఏవియేషన్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

సాఫ్రాన్‌ సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

శంషాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న క్రాప్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ ఫెసిలిటీని ప్రధాని మోదీ బుధవారం నాడు వర్చువల్‌గా ప్రారంభించారు 

ఇప్పటికే 1500 రఫెల్ క్రాఫ్ట్‌లను భారత్‌ కొనుగోలు చేస్తోందని వివరించారు.

MSMEలను ప్రోత్సహించే విధానంలో ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు.

దేశంలో ఎన్నో పారిశ్రామిక సంస్కరణలను తీసుకువచ్చామని తెలిపారు ప్రధాని మోదీ.

కొన్ని రంగాల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతించామని పేర్కొన్నారు.

జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి పన్నుల భారాన్ని తగ్గించామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.

కొత్తగా నాలుగు లేబర్‌కోడ్‌లను అమలు చేస్తూ కార్మికులకు మేలు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రధాని మోదీ.