జగన్‌పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.
జగన్‌రెడ్డి ఐదేళ్లలో ఏపీని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
వైసీపీ హయాంలో ఏపీ ఆర్థికంగా దివాళా తీసిందని ఆరోపించారు.
ఏపీని తాకట్టు పెట్టి జగన్ అప్పులు తెచ్చారని ఆక్షేపించారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా జగన్ పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఏపీ వాటాని ఇవ్వకుంటే రాష్ట్రానికే నష్టమని పేర్కొన్నారు
సీఎం చంద్రబాబు.
వైసీపీ పాలనలో రాష్ట్ర వాటా ఇవ్వక చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో 4.73లక్షల ఇళ్లను రద్దు చేశారని దుయ్యబట్టారు.
ఇళ్ల నిర్మాణ వ్యవస్థను జగన్ హయాంలో పూర్తిగా భ్రష్టుపట్టించారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు.
వైసీపీ పాలనలో నివాస యోగ్యం కాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే ఇసుకలోనూ జగన్ అండ్ కో దోచుకున్నారని ఆరోపించారు.
ముస్లింలకు కూడా అందరితో సమానంగా ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
వచ్చే ఏడాది నాటికి 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని ఉద్ఘాటించారు.
ఇది పేదల ప్రభుత్వమని.. వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని నొక్కిచెప్పారు.
ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Related Web Stories
తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
రాష్ట్ర స్థాయి భక్త కనకదాస జయంతి
ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్
సీఎంతో శ్రీచరణి, మిథాలీ రాజ్ భేటీ