తిరుపతి జిల్లాలో  డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ పర్యటన 

తిరుపతి జిల్లాలో మామండూరులో అటవీ ప్రాంతాల్లో పలు ప్రాంతాలని పవన్ సందర్శించారు.

అడవిలో పలు రకాల చెట్లను పవన్ కల్యాణ్ పరిశీలించారు.

నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వాచ్ టవర్ నుంచి అడవిని పరిశీలించారు డిప్యూటీ సీఎం.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఎలా నియంత్రిస్తున్నారంటూ అధికారులని అడిగి తెలుసుకున్నారు  డిప్యూటీ సీఎం.

అడవిలో నాలుగు కిలోమీటర్లకి పైగా ప్రయాణం చేశారు పవన్ కల్యాణ్.

రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునూ పరిశీలించారు  పవన్ కల్యాణ్.

ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలని పరిశీలించి వివరాలు అడగి తెలుసుకున్నారు  డిప్యూటీ సీఎం.

వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది..? తదితర వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు.

వాగుకి ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్‌ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

ఈ క్రమంలో మామండూరు అటవీప్రాంతంలో మొక్కలు నాటారు పవన్‌ కల్యాణ్.

దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న ఎర్రచందనం ఏపీ నుంచే వెళ్తోందని తెలిపారు.

స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన బాధ్యత మనపైనే ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.