చేవెళ్ల ప్రమాదం.. కలిచివేస్తున్న దృశ్యాలు..

బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.

తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో.. బస్సులోని ప్రయాణికులు కంకరలో ఇరుక్కున్నారు.

కంకరలో ఇరుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను బయటకు తీసి  ఆసుపత్రికి తరలించారు అధికారులు.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం హృదయాలను కలిచివేస్తోంది.