వివిధ ఆవిష్కరణలు చేసిన స్వీడెన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట ఈ బహుమతిని ఏర్పాటైన విషయం తెలిసిందే.
డైనమైట్‌ను కనుగొన్నందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన పేరిట 355 పేటెంట్లు ఉండేవి
తన ఆవిష్కరణలతో సంపన్నుడైన నోబెల్.. యుద్ధాలకు కారకుడయ్యాడన్న అపప్రథనూ మూటగట్టుకున్నారు.
నోబెల్ మరణించినట్టు ఒకసారి పేపర్‌లో తప్పుడు వార్త వచ్చింది. ఆయనను పేపర్లు మృత్యు వ్యాపారిగా పేర్కొన్నాయి
దీంతో కనువిప్పు కలిగిన ఆల్ఫ్రెడ్.. సమాజ హితం కోసం తన పేరిట నోబెల్ బహుమతిని ఏర్పాటు చేశారు.
1895లో నోబెల్ బహుమతి ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికను తన విల్లులో ఆయన పొందుపరిచారు.
సమాజహితం కోసం శ్రమించిన వారికి ఈ బహుమతి, పారితోషికం కింద తన సంపదను ఇవ్వాలని ఆయన చెప్పారు.
1901లో తొలిసారిగా ఫిజిక్స్, కెమెస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్‌తో పాటు నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చారు
ఇక 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతులను ఇస్తున్నారు.
Related Web Stories
వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi: సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
లక్ష కోట్ల కుంభకోణంకు కారణం వీళ్లే.. కవిత షాకింగ్ కామెంట్స్
AI చాట్‌బాట్‌తో జాగ్రత్త.. ఈ ప్రశ్నలు అడిగితే జైలుకే..!