సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌కు అనుకూలమైనచోట ఓట్లు తొలగించారని ధ్వజమెత్తారు.

నకిలీ లాగిన్స్‌, సాఫ్ట్‌వేర్‌తో ఓటర్లను తీసివేశారని విమర్శించారు.

కర్ణాటకలో కొన్నిచోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగానే లక్షలాది ఓట్లు తొలగించారు.

నకిలీ ఓట్లకు లింక్‌ చేసినవన్నీ ఫేక్‌ ఫోన్‌ నెంబర్లేనని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు.

ఆ ఫోన్‌ నెంబర్లకు కాల్‌ చేస్తే ఎందుకు పనిచేయడం లేదని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.

ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లు వాడారని ఆరోపించారు.

కాంగ్రెస్‌కు బలం ఉన్న చోట ఓట్లు తొలగించారని ధ్వజమెత్తారు రాహుల్‌ గాంధీ.

తాను చెబుతున్నవన్నీ ఆరోపణలు కాదు.. వాస్తవాలని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.

చాలాచోట్ల మైనార్టీలు, ఆదివాసీల ఓట్లు తొలగించారని  ఆవేదన వ్యక్తం చేశారు.

ఓట్ల తొలగింపునకు ఎవరు అప్పీల్‌ చేశారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

సెంట్రలైజ్డ్‌ వ్యవస్థ ద్వారా ఓట్లు డిలీట్‌ చేస్తున్నారని ఆక్షేపించారు.

ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్‌ చేస్తున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.