ప్రపంచంలో అత్యధిక బంగారం  ఉన్న దేశం ఏది?

బంగారం అత్యంత విలువైన లోహం. ఏ దేశ ఆర్థిక స్థిరత్వానికైనా బంగారం నిల్వలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ప్రపంచంలోని అన్ని పెద్ద దేశాలు ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఉపయోగించుకోవడానికి వీలుగా బంగారు నిల్వలను ఉంచుతాయి. 

ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు అమెరికా వద్ద ఉన్నాయి. సుమారు 8133.5 టన్నుల బంగారం ఉంది.

రెండో స్థానంలో జర్మనీ ఉంది. ఈ దేశంలో దాదాపు 3351 టన్నుల బంగారం ఉంది. 

ఇటలీ మూడవ స్థానంలో ఉంది. ఈ దేశ ఖజానాలో 2452 టన్నుల బంగారం ఉంది.

భారతదేశంలో అధికారికంగా ఇక్కడ 876 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉంది. 

కానీ ఆశ్చర్యకరంగా ఇండియాలో గుళ్లు, ప్రజల వద్ద అమెరికా ప్రభుత్వ ఖజానా కంటే ఎక్కువ బంగారం ఉంది.

పద్మనాభ స్వామి ఆలయం, తిరుపతి, జగన్నాథ ఆలయం, వైష్ణో దేవి ఆలయాల్లో 4000 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది.