వైసీపీ అధినేత జగన్‌‌పై మంత్రి లోకేష్‌ షాకింగ్ కామెంట్స్

జగన్‌ ఫేక్‌ డ్రామా మరోసారి బెడిసికొట్టిందని విమర్శించారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ వైసీపీ కుట్ర పన్నిందని లోకేష్ ధ్వజమెత్తారు.

ఈ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిందని ఎద్దేవా చేశారు మంత్రి లోకేష్.

దోషులెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

కూటమి ప్రభుత్వంపై నిత్యం విషం చిమ్మడమే జగన్‌ పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు లోకేష్.

ప్రజా ప్రభుత్వ పాలనలో జగన్‌ ఆటలు సాగవని వార్నింగ్ ఇచ్చారు.

జగన్ అండ్ కో అసత్యాలనే ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని లోకేష్ ధ్వజమెత్తారు.

జగన్ అండ్ కో అసత్యాలని ప్రజలు నమ్మరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.