సీఎంతో శ్రీచరణి, మిథాలీ రాజ్ భేటీ

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లను ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

క్రికెటర్ శ్రీచరణికి రూ. 2.5 కోట్ల నగదు పురస్కారం

శ్రీచరణికి కడపలో ఇంటిస్థలం ఇవ్వనున్న ప్రభుత్వం 

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం, మంత్రులతో శ్రీచరణి పంచుకున్నారు. 

ప్రపంచకప్‌ గెలుచుకోవడం ద్వారా టీమ్‌ఇండియా జట్టు సత్తా చాటిందని సీఎం కొనియాడారు. 

మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని అభినందించారు. 

శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ టీమ్ విన్నర్ శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది.