ప్రైవేట్ కాలేజీల నిర్వాహకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఏదిపడితే అది చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు సేవ చేయడంలేదని.. వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు.
ఫీజురీయింబర్స్‌మెంట్‌పై వారు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాలేజీలను బంద్ చేయించిన వారితో చర్చలు ఎలా ఉంటాయని నిలదీశారు.
తమాషాలు చేస్తే.. తాట తీస్తానని హెచ్చరించారు.
విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
విద్య అనేది సేవ.. వ్యాపారం కాదని స్పష్టం చేశారు
సీఎం రేవంత్‌రెడ్డి.
విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో తమకు తెలుసునని చెప్పుకొచ్చారు.
కొంతమంది సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వానికి సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారని ధ్వజమెత్తారు.
వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దామని సీఎం రేవంత్‌రెడ్డి మందలించారు.
Related Web Stories
సీఎంతో శ్రీచరణి, మిథాలీ రాజ్ భేటీ
చేవెళ్ల ప్రమాదం.. కలిచివేస్తున్న దృశ్యాలు..
సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన..
సీఎం సమక్షంలో మల్లోజుల సహా లొంగిపోయిన 60 మంది మావోలు