రెడ్‌బుక్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రెడ్ బుక్ తనపని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
తమ ప్రభుత్వంలో కక్షసాధింపులకు పాల్పడమని పేర్కొన్నారు మంత్రి నారా లోకేశ్.
తన తల్లిని అవమానించిన వారిని తాను వదలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు.
మహిళల జోలికి వస్తే ఊరుకోనని హెచ్చరించారు.
జగన్.. వై నాట్ 175 అంటే.. ప్రజలే వై నాట్ 11 అని అన్నారని ఎద్దేవా చేశారు.
ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయ్యిందని వ్యాఖ్యానించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే ఆలౌట్ అయిందని సెటైర్లు గుప్పించారు.
ప్రతిపక్షంలో తమకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా కల్పించారు మంత్రి లోకేశ్.
‘కలలకు రెక్కలు’ పేరుతో విదేశాల్లో చదువుకునే తెలుగు వారికి వచ్చే ఏడాది నుంచి అండగా ఉంటామని మాటిచ్చారు.
రాబోయే పదేళ్లలో కూడా కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
కూటమి మరో 15 ఏళ్ల పాటు కలసి పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.
తమ కుటుంబానికి ప్రవాసాంధ్రులు కొండంత బలమని తెలిపారు.
స్పీడ్‌కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని తెలిపారు
మంత్రి నారా లోకేశ్.
Related Web Stories
ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
నల్లజర్లలో రైతన్నా.. మీకోసం కార్యక్రమం
డిసెంబరు ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
ఏవియేషన్ రంగంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు