ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రస్తావించారు.
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ రేపటిలోగా డబ్బులు రిఫండ్ చేయాలని ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి అంశం పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
కేవలం ఇద్దరే ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు ఉండటంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు.
డీజీసీఏ తరపున ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ఇండిగో సంక్షోభానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విమాన టిక్కెట్ గరిష్ఠంగా రూ.18వేలు మించొద్దని ఆదేశాలు జారీ చేశారు.
టికెట్ ధరలను నాలుగు కేటగిరీలుగా మంత్రిత్వ శాఖ విభజించిందని చెప్పుకొచ్చారు.
500 కిలోమీటర్లకు ఒక రేటు, 500 నుంచి 1000 కిలో మీటర్లకు ఇంకో రేటు ఉంటుందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Related Web Stories
నల్లజర్లలో రైతన్నా.. మీకోసం కార్యక్రమం
డిసెంబరు ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు
ఏవియేషన్ రంగంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు వీరే