ఇండియా మాత్రమే కాదు.. టిక్‌టాక్‌ను వీళ్లు కూడా వద్దంటున్నారు..
ఎంతో మందిని అలరించిన టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించి రాబోయే జూన్ నెలతో ఐదేళ్లు పూర్తవుతోంది.
భారత్ మాత్రమే కాదు.. పలు ఇతర దేశాలు కూడా టిక్‌టాక్ పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
2020 జూన్‌లో మన దేశ భద్రతా రీత్యా, పౌరుల వ్యక్తిగత డేటాను సేకరించి చైనా ప్రభుత్వానికి అందిస్తోందనే కారణంతో టిక్‌టాక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
2020లోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టిక్‌టాక్‌పై నిషేధం విధించారు. అయితే ఆ బ్యాన్ అమలు కాలేదు.
ట్రంప్ తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం తాజాగా టిక్‌టాక్‌పై నిషేధం విధించింది. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తొలి రోజునే ఆ నిషేధాన్ని ఎత్తి వేశారు.
పోర్నోగ్రఫీ, అసభ్య డ్యాన్స్‌ల కారణంగా ఇండోనేసియా ప్రభుత్వం 2018లో టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది. అలాంటి వీడియోల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ రావడంతో బ్యాన్ నిలిచిపోయింది.
టిక్‌టాక్‌లో అప్‌లోడ్ అవుతున్న కంటెంట్ అసభ్యంగా ఉందని 2019లో పాకిస్తాన్ కూడా టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది. ఆ తర్వాత ఆ బ్యాన్ రద్దయింది.
యూరోపియన్ యూనియన్‌కు చెందిన చాలా దేశాలు పౌరుల డేటా, దేశ భద్రత విషయంలో టిక్‌టాక్‌పై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో పాటు కొన్ని మధ్య ప్రాశ్చ్య దేశాలు టిక్‌టాక్ కంటెంట్‌పై విమర్శలు చేస్తూ పాక్షికంగా బ్యాన్ చేశాయి.