తిరుపతిలో మోహన్‌బాబు కాలేజీ వద్ద  ఉద్రిక్తత నెలకొంది

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కాలేజీకి వస్తున్నట్లు సమాచారం

సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేసి ఎవరినీ లోపలకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు

మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది

మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు

ఇప్పటికే మంచు మోహన్ బాబు, విష్ణు కాలేజ్ వద్దే ఉన్నారు

ఈ నేపథ్యంలో మనోజ్ పర్యటన అత్యంత ఉత్కంఠను రేపుతోంది

అయితే మంచు మనోజ్ నేరుగా నారా వారిపల్లెకు చేరుకుని నారా లోకేష్‌తో భేటీ అయ్యారు

మరోవైపు మంచు మనోజ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు

ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు