ఆంధ్రప్రదేశ్‌‌లో వాట్సప్ సేవలను మంత్రి  నారా లోకేష్ ప్రారంభించారు

దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది

ఈ సందర్భంగా వాట్సప్ సేవల కోసం నెంబర్‌ను విడుదల చేశారు మంత్రి లోకేష్

వాట్సప్ గవర్నెన్స్ కోసం నెంబర్ 9552300009ను అనౌన్స్ చేశారాయన

దీని ద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది

ఈ తొలి విడతలో దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ,

అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలు అందిస్తారు

వాట్సప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు 2024 అక్టోబరు 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది

ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సప్ గవర్నెన్స్ తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం