మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించిన తెలుగు సీఎంలు

ఘటనపై రెండు రాష్ట్రాల సీఎంలు విచారం వ్యక్తం చేశారు

ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు

తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు

తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ఆదుకోవాలని, 

గాయపడినవారికి సరైన వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంలను కోరారు

రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సాయం అందించడానికి సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు