భారత్‌కు అమెరికా వార్నింగ్
పన్నుల మోత తప్పదంటూ..!
రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే పన్నుల మోత తప్పదంటూ హెచ్చరించింది.
రష్యాతో గనుక వ్యాపారాలు సంబంధాలు కొనసాగిస్తే 500 శాతం సుంకాలు విధిస్తామని మోదీ సర్కారుకు వార్నింగ్ ఇచ్చింది యూఎస్‌ఏ.
ట్రంప్ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో దీనిపై బిల్లు తీసుకొస్తామని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం స్పష్టం చేశారు.
రష్యా నుంచి భారత్, చైనాలు 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయని లిండ్సే తెలిపారు.
ట్రంప్ ఓకే చెప్పారని.. ఈ బిల్లును ఆగస్టులో ప్రవేశపెట్టే చాన్స్ ఉందన్నారు.
రష్యా నుంచి చమురు కొంటూ ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై ఇదే విధంగా భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు లిండ్సే.
త్వరలోనే భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఉంటుందని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో లిండ్సే వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.
Related Web Stories
బెదిరింపులకు లొంగేది లేదు.. జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇండో-అమెరికా ట్రేడ్ డీల్.. డెడ్‌లైన్ పొడిగిస్తారా?
ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తా.. పెద్దన్న వార్నింగ్
అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు.. ట్రంప్ కామెంట్స్ వైరల్!