బెదిరింపులకు లొంగేది లేదు..
జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్!
అణ్వస్త్ర బెదిరింపులకు లొంగేది లేదని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
అణ్వాయుధ బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడిన పాక్‌కు ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పామన్నారు.
ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పాక్ వల్లే వరుసగా ఉగ్రదాడులను ఎదుర్కొన్నామని జైశంకర్ పేర్కొన్నారు.
పహల్గాం ఉగ్రదాడి ఓ ఆర్థిక యుద్ధ చర్య అని.. జమ్మూకశ్మీర్ అభివృద్ధి, పర్యాటకాన్ని ఓర్వలేకే ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని వ్యాఖ్యానించారు.
కరడుగట్టిన ఉగ్రవాదులంతా పాక్‌లోనే ఉన్నారని.. బడా నగరాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు.
పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్న జైశంకర్.. టెర్రరిజానికి సహకరించే ప్రభుత్వాలకు తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
Related Web Stories
ఇండో-అమెరికా ట్రేడ్ డీల్.. డెడ్‌లైన్ పొడిగిస్తారా?
ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తా.. పెద్దన్న వార్నింగ్
అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు.. ట్రంప్ కామెంట్స్ వైరల్!
ముగ్గుర్ని కనండి.. మస్క్ సూచన సరైనదేనా?