ముగ్గుర్ని కనండి..
మస్క్ సూచన సరైనదేనా?
ప్రతి ఒక్కరూ ముగ్గుర్ని పిల్లల్ని కనాల్సిందేనని అంటున్నారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.
అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను మస్క్ మరోమారు తోసిపుచ్చారు.
అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు తగ్గుతోందన్నారు మస్క్.
జననాల రేటు సమస్యను నివారించాలంటే సంతానం కనగలిగే వారు కనీసం ముగ్గురు పిల్లలకు జన్మను ఇవ్వాలంటూ మస్క్ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు.
తగ్గుతున్న జనాభా స్థాయిలను నిలబెట్టేందుకు ముగ్గురు పిల్లల్ని కనక తప్పదని మస్క్ సూచించారు.
జననాల రేటు తగ్గుతుండటం వల్ల నాగరికత పతనమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు టెస్లా అధినేత.
అధిక సంతానం విషయంలో తన మాటల్ని నమ్మకపోతే మరో 20 ఏళ్లు వేచి చూడాలని మస్క్ స్పష్టం చేశారు.
Related Web Stories
పత్తా లేకుండా పోయిన ఖమేనీ.. ఇరాన్ ప్రజల్లో టెన్షన్!
ఇరాన్‌తో శాంతి చర్చలు.. ట్రంప్ మామూలోడు కాదు!
ప్రపంచంలోని మసీదులు లేని దేశాలు ఏవో తెల్సా..
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ...