ఇరాన్‌తో శాంతి చర్చలు..  ట్రంప్ మామూలోడు కాదు!

గత 12 రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీని వల్ల పశ్చిమాసియా కల్లోలంగా మారింది.

ఇరు దేశాలు ఇప్పట్లో యుద్ధాన్ని ఆపవని అనుకుంటున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ నడుమ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తానే మధ్యవర్తిత్వం చేశానని తెలిపారు.

ఒకవైపు ఇరాన్ అధికారులతో మాటామంతీ జరుపుతూనే మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారట ట్రంప్.

శాంతిని నెలకొల్పబోతున్నాం అంటూ తన యంత్రాంగంతో ట్రంప్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఖతార్‌లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో ఇజ్రాయెల్‌తో ట్రంప్ బలవంతంగా కాల్పుల విరమణ చేయించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ మామూలోడు కాదు.. అమెరికా ప్రయోజనాలు, తన స్వార్థం తప్ప ఆయనకు మరేదీ పట్టదని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి.

కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది ఇరాన్.

ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చాయని అక్కడి సైన్యం పేర్కొంది.