విశాఖలో మోదీ సందడి...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో ప్రతి ఏడాది జూన్‌ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.

యోగా డే వేడుకల్లో పాల్గొనడానికి విశాఖపట్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు.

 ప్రధానికి గవర్నర్  అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు.

ఐఎన్ఎస్ డేగ నుంచి తూర్పు నావికాదళం చోళ సూట్‌కు మోదీ వెళ్లారు.

  విశాఖపట్నంలో రేపు(శనివారం) యోగా డే వేడుకల్లో  ప్రధాని మోదీ పాల్గొననున్నారు.

 ప్రధానితో కలిసి యోగా డేలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలు పంచుకోనున్నారు.