అణ్వాయుధాలు ప్రయోగిస్తే ఏమవుతుంది?

ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన ఆయుధాల్లో అణ్వాయుధాలే అత్యంత వినాశకరమైనవి.

అణు విస్ఫోటనం వల్ల లక్షలాది మంది ప్రాణాలు సెకన్లలో గాల్లో కలిసిపోతాయి. 

దీనిని ప్రయోగించాక పుట్టే వేడి, రేడియేషన్ పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తుంది. 

వేల కిలోమీటర్లలోని జీవరాశితో పాటు భూభాగం ధ్వంసమవుతుంది. గడ్డి మొక్క కూడా మొలవదు.

సుదూర ప్రాంతాలకూ దీర్ఘకాలం పాటు రేడియేషన్ వ్యాప్తి చెంది ప్రజలు జీవితాంతం అనారోగ్య సమస్యలు అనుభవిస్తారు. 

అణు శీతాకాల పరిస్థితి సూర్యరశ్మిని నిరోధించడం వల్ల భారీ ఆహార కొరత, విస్తృత ప్రాంతాల్లో కరువు ఏర్పడుతుంది.

ప్రస్తుతం ప్రపంచంలో 9 దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి. అవి రష్యా, యూఎస్, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇండియా, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా.