ఇరాన్ కు సంబంధించిన 10 ముఖ్యమైన విషయాలు..

1. ఇరాన్ రాజధాని టెహ్రాన్.

2. ఇరాన్ అధికారిక పేరు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్.

3. ఇరాన్ పాత పేరు పర్షియా. 1935 లో ఇరాన్ గా మార్చారు.

4. ఇరాన్ అధికారిక భాష పర్షియన్.

5. ఇరాన్ కరెన్సీని ఇరానియన్ రియాల్ అంటారు.

6. ఇరాన్ జెండా ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. తెలుపు రంగు మధ్యలో ఇస్లామిక్ చిహ్నం ఉంది.

7. ఇరాన్ దేశ జనాభా 80 మిలియన్లకు పైనే.

8. ఇరాన్ లో ప్రధాన మతం ఇస్లాం. ఇక్కడి జనాభాలో 99% ముస్లింలే

9. ఇరాన్‌లో షియా ముస్లిం జనాభా ఎక్కువ. సున్నీ ముస్లింల సంఖ్య తక్కువగా ఉంటుంది.

10. ఇరాన్ ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి. దాదాపు 5,000 సంవత్సరాల నాటి నాగరికత కలిగి ఉంది.