విశాఖ సాగర తీరాన  యోగా దినోత్సవ వేడుకలు..

విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది.

లక్షలాది మంది సాగర తీరానికి చేరుకుని యోగాసనాలు చేస్తున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.

ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేస్తున్నారు.

 విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు ప్రజలు పాల్గొన్నారు. 

దీంతో ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. 

ఈ సందర్భంగా సందర్భంగా 'యోగాంధ్ర' కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందే ప్రధాన మంత్రి మోదీ అని.. ఆయన కృషి వల్లే ఈ రోజు 130 దేశాలు యోగా డే నిర్వహిస్తున్నాయని అన్నారు. 

విశాఖ తీరంలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.

యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే, మోదీ గారు విశ్వవ్యాప్తంగా యోగాను ప్రోత్సహించారని పవన్ కల్యాణ్ అన్నారు. 

ప్రధాని మోదీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.