పత్తా లేకుండా పోయిన ఖమేనీ..
ఇరాన్ ప్రజల్లో టెన్షన్!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకోవడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
యుద్ధం ముగిసిందని యూఎస్‌ఏ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కనిపించకుండా పోయారు.
కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రకటన వచ్చినప్పటి నుంచి ఖమేనీ జాడ తెలియడం లేదు. దీంతో ఇరాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఖమేనీ జాడ గురించి ఆర్కైవ్స్ ఆఫీస్ చీఫ్ మెహదీ ఫజైలీ కూడా సూటిగా సమాధానం చెప్పడం లేదు.
ఖమేనీ కోసం అందరమూ ప్రార్థనలు చేద్దామని.. త్వరలో ఆయనతో కలసి విజయోత్సవాలు జరుపుకుందామని మెహదీ ఫజైలీ తెలిపారు.
ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరంగా ఒక బంకర్‌లో అలీ ఖమేనీ ఉన్నారని వినిపిస్తోంది.
Related Web Stories
ఇరాన్‌తో శాంతి చర్చలు.. ట్రంప్ మామూలోడు కాదు!
ప్రపంచంలోని మసీదులు లేని దేశాలు ఏవో తెల్సా..
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ ...
విశాఖ సాగర తీరాన యోగా దినోత్సవ వేడుకలు..