ఇజ్రాయెల్‌తో యుద్ధంలో గెలిచామంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన కామెంట్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు.
ఖమేనీ ప్రకటన తర్వాత ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షల్ని సడలించాలనే ఆలోచన నుంచి వైదొలిగినట్లు ట్రంప్ చెప్పారు.
ఒకవేళ ఇరాన్ గానీ అణు కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడితే ఆ దేశం మీద బాంబులు వేస్తామని హెచ్చరించారు ట్రంప్.
ఇజ్రాయెల్‌పై గెలిచామంటూ ఖమేనీ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమన్నారు అగ్రరాజ్య అధినేత. యుద్ధ సమయంలో ఆయన ఎక్కడ దాక్కున్నారో తనకు తెలుసునని ట్రంప్ పేర్కొన్నారు.
నీచమైన చావు చావకుండా ఖమేనీని రక్షించానని, అయినా ఆయన తనకు ధన్యవాదాలు చెప్పలేదన్నారు ట్రంప్.
ఇరాన్‌ను భారీగా దెబ్బతీసేందుకు వెళ్తున్న ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను తాను వెనక్కి మళ్లించానన్నారు యూఎస్ ప్రెసిడెంట్.
ఆ దాడి గనుక జరిగి ఉంటే వేలాది మంది ఇరాన్ ప్రజలు చనిపోయి ఉండేవారని ట్రంప్ చెప్పుకొచ్చారు.