అధ్యక్ష పదవి అంత ఈజీ కాదు..
ట్రంప్ కామెంట్స్ వైరల్!
అమెరికా అధ్యక్షుడిగా ఉండటం అంత సులువేం కాదని.. ఇది చాలా ప్రమాదకరమని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
అధ్యక్ష పదవి ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని ట్రంప్ చెప్పారు. తాజాగా శ్వేతసౌధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
కారు రేసింగ్, బుల్ రైడింగ్‌లాగే అధ్యక్ష పదవి ప్రమాదకరమని.. చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు.
గతేడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది.
పెన్సిల్వేనియా ర్యాలీని గుర్తుచేసుకున్న ట్రంప్.. ఈ పోస్ట్‌లో ఉంటే ఇంత ముప్పు అని తెలిస్తే, అసలు రేసులో ఉండేవాడ్ని కాదన్నారు.
ఇది ప్రమాదకరమైన వృత్తి అని.. అధ్యక్ష పదవిలో కొనసాగడం సవాళ్లతో కూడుకున్నదని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్‌కు అమెరికా 30 బిలియన్ డాలర్ల సాయం చేస్తుందంటూ వస్తున్న వార్తల్ని ఖండించిన ట్రంప్.. అవన్నీ ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు.
Related Web Stories
ముగ్గుర్ని కనండి.. మస్క్ సూచన సరైనదేనా?
పత్తా లేకుండా పోయిన ఖమేనీ.. ఇరాన్ ప్రజల్లో టెన్షన్!
ఇరాన్‌తో శాంతి చర్చలు.. ట్రంప్ మామూలోడు కాదు!
ప్రపంచంలోని మసీదులు లేని దేశాలు ఏవో తెల్సా..