ఇండో-అమెరికా ట్రేడ్ డీల్..  డెడ్‌లైన్ పొడిగిస్తారా? 

భారత్-యూఎస్ ట్రేడ్ డీల్ మీద జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇరు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందంపై జులై 8వ తేదీ కంటే ముందే కీలక ప్రకటన రానుందని వినిపిస్తోంది.

మన దేశంపై అమెరికా విధించిన టారిఫ్‌ల సస్పెన్షన్ జులై 9 వరకే అమల్లో ఉంటుంది.

టారిఫ్‌లపై డెడ్‌లైన్‌ను పొడిగించే ఉద్దేశం తమకు లేదని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వెల్లడించారు. దీంతో త్వరలో టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.

మన దేశం నుంచి చేసుకొనే దిగుమతుల మీద డొనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం టారిఫ్‌లు జులై 9వ తేదీ వరకు అమల్లోకి రావు.

ఈ ట్రేడ్ డీల్‌లో ఎక్కువగా వ్యవసాయం, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్‌ల మీద దృష్టి పెడుతున్నారు.

భారత్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అదిపెద్ద డీల్‌కు తెరలేవనుందని విశ్లేషకులు చెబుతున్నారు.