సిందూర్‌ పార్ట్‌ - 2పై  కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని చెప్పుకొచ్చారు.

ఆపరేషన్‌ సిందూర్‌‌ని కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని క్లారిటీ ఇచ్చారు.

పాకిస్థాన్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు.

ఉగ్రవాదులకు మద్దతిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్‌నాథ్‌సింగ్ గుర్తు చేశారు.

పాకిస్థాన్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ భారతదేశ పౌరులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మతం చూసి పాకిస్థాన్ ఉగ్రవాదులని భారత సైనికులు మట్టుబెట్టలేదని.. వారు చేసిన పనులను చూసే చంపేశారని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్.

పహల్గామ్ ఘటన తర్వాత త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరిగిందని గుర్తుచేశారు.

ఆ సమావేశంలో తాను ఒకే ఒక ప్రశ్న అడిగినట్లు చెప్పుకొచ్చారు.

ఒకవేళ తమ ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఆపరేషన్‌కు మీరు సిద్ధమా..? అని తాను ప్రశ్నించానని తెలిపారు.

వారు నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధంగా ఉన్నామని తనతో చెప్పారని హర్షం వ్యక్తం చేశారు.

దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.

కేవలం సరిహద్దుల్లోనే కాదని.. భూభాగంలో 100 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్లు రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఆ దాడుల్లో మసూద్‌ అజార్‌ కుటుంబం చెల్లాచెదురైందని తెలిపారు.

ఆ విషయాన్ని తాజాగా.. జైషే ఉగ్ర నాయకులే అంగీకరించారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు.