గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైల్వే, రాష్ట్ర పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహించారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సంయుక్తంగా డాగ్ స్క్వాడ్‌లతో భద్రతా తనిఖీలు చేపట్టారు.
అలాగే సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్‌లో పోలీసులు రిహార్సల్స్ చేశారు.
డాగ్ స్క్వాడ్‌లతో నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
సికింద్రాబాద్ రైల్వే గ్రౌండ్స్‌లో ఆర్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఫుల్ డ్రెస్ కోడ్ రిహార్సల్స్ నిర్వహించారు.
భద్రత చర్యల్లో భాగంగా 24 గంటల ముందుగా రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేశారు.
అలాగే రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతాలు, మెట్రో, పబ్లిక్ ఏరియా లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రతపై పోలీసులు దృష్టిపెట్టారు.
రైల్వేస్టేషన్లే కాకుండా, హైదరాబాద్‌లోని బస్టాండ్లు, విమానాశ్రయం, ప్రముఖ మాల్స్ వద్ద కూడా పోలీసులు నిఘా పెంచారు.
ఉగ్రవాద కార్యకలాపాలు, పేలుడు పదార్థాలను గుర్తించడంలో భాగంగా డాగ్ స్క్వాడ్‌తో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
ఈ భారీ భద్రతా చర్యలు ప్రయాణికుల భద్రతను కాపాడటానికి తీసుకున్న కీలకమైన ప్రయత్నమని పోలీసులు తెలిపారు.
Related Web Stories
సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వం గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి ఆలయంపై వైసీపీ కుట్రలు
కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం... ప్రత్యేక పూజలు
కేసీఆర్, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్