సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వం గుడ్ న్యూస్  

ఉద్యోగులకు డీఏతోపాటు కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేసింది. సామాన్యుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో నీరు చెట్టు పథకం కింద పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులు రూ. 40 కోట్లు విడుదల చేసింది.  

ఈ నిర్ణయంతో 19 వేల మంది కాంట్రాక్టర్లకు ఊరట లభించినట్లయింది.

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్‌తోపాటు ఎరియర్స్ ప్రకటించింది. వీటి కోసం రూ. 2,653 కోట్ల నిధుల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఉద్యోగుల డీఏ కోసం ఏకంగా రూ.110 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.  

పోలీసులకు సరెండర్ లీవ్ చెల్లింపులు సైతం విడుదల చేయనుంది. దీని ద్వారా 55 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.

డీఏ, ఏరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది ఉద్యోగలు లాభాం పొందనున్నారు.

ఇక 2.70 లక్షల మంది పెన్షనర్లు సైతం ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.

ఈ పండగ వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం 5.70 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఈ నగదును వారి అకౌంట్లలో వేయనుంది.

అలాగే సంక్రాంతి పండగ వేళ మండల కేంద్రాల్లో కొత్తగా అన్న క్యాంటీన్‌లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 

దాంతో గ్రామీణ ప్రజలకు సైతం రూ. 5లకే టిఫిన్, లంచ్, డిన్నర్ అందుబాటులోకి రానుంది.