తమిళనాట ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పటినుంచంటే

లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏప్రిల్ 19న తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 9న రాజధాని చెన్నై మహానగరంలో ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. 

టి.నగర్‌లోని పనగల్‌ పార్క్‌ నుంచి తేనాంపేట సిగ్నల్‌ వరకు రోడ్ షో కొనసాగుతుంది. 

మళ్లీ 12న ప్రధాని మోదీ మరోమారు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ రోజున ధర్మపురిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 

చెన్నైలో జరిగే రోడ్‌ షోను చరిత్రలో మిగిలిపోయే విధంగా నిర్వహించాలని బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.  

ఈ ఎన్నికల్లో తమిళనాట కనీసం 4 - 5 ఎంపీ సీట్లను బీజేపీ స్వతహాగా గెలుచుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు పని చేస్తున్నారు.