జగన్ పై మండిపడ్డ షర్మిల

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నా అనుకున్న వాళ్లందరినీ సీఎం జగన్ నాశనం చేశాడని, హత్యా రాజకీయాలను ప్రోత్సాహించాడని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి తన అన్న అని, ఆయనంటే తనకు ద్వేషం లేదని, గత ఎన్నికల సమయంలో తనని చెల్లే కాదు బిడ్డ అని పిలిచాడని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. 

కానీ.. సీఎం అయ్యాక జగన్ మారిపోయాడని, ఇప్పుడున్న జగన్ తనకు పరిచయడం లేడని బాంబ్ పేల్చారు. 

వివేకాను హత్య చేసిన వారికే కడపలో ఎంపీ అభ్యర్థిగా సీట్ ఇచ్చాడని, ఇది తెలిసి తాను తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

హత్య చేసిన వాళ్లకు శిక్ష విధించలేదని.. చేసిన వాళ్లు, చేయించిన వాళ్లు తప్పించుకొని తిరుగుతున్నారని ఉద్ఘాటించారు. 

వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని, వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారని సంచలన కామెంట్స్ చేశారు.