బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ చాయ్ పే చర్చ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, అమెరికాకు వ్యాపారవేత్త బిల్ గేట్స్ భారత పర్యటనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో, బిల్ గేట్స్‌తో చాయ్ పే చర్చలో పాల్గొన్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ రివల్యూషన్ వరకు అనేక అంశాలపై వీరిద్దరు చర్చించారు. 

45 నిమిషాల వీడియోలో ఇద్దరూ భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, టీకా, సాంకేతికత, మహిళా శక్తి, వాతావరణ మార్పుల గురించి మాట్లాడారు. 

డీప్‌ఫేక్‌ల దుర్వినియోగంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చర్యలను ప్రారంభించినట్లు తెలిపారు.