యువతకు చంద్రబాబు గుడ్ న్యూస్..

యువత ఆశలను సీఎం జగన్ వమ్ము చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజాగళంలో భాగంగా పలమనేరులో ఆయన మాట్లాడుతూ..

అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే13వ తేదీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. 

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి.. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.