ఏపీ పాలనపై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలన భేష్ అంటూ కితాబిచ్చారు.
గురువారం ఉదయం ఏపీ , తెలంగాణ ఎన్డీయే ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు ప్రధాని మోదీ.
నేతలతో కలిసి ప్రధాని మోదీ ఢిల్లీలో అల్పాహార విందులో పాల్గొన్నారు.
అల్పాహార విందులో పలు కీలక అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు.
ఈ నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు పాలన చాలా బావుందని ప్రశంసించారు.
పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయని ప్రధాని స్పష్టం చేశారు.
అయితే ఏపీలో పాలనను పొగడ్తలతో ముంచెత్తిన ప్రధాని.. తెలంగాణ బీజేపీ ఎంపీలపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో సరైన
ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించలేకపోతున్నారని ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు
హితవు పలికారు.
నేతలు కష్టపడి పనిచేయాలని సూచించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించారు.
Related Web Stories
రెడ్‌బుక్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
నల్లజర్లలో రైతన్నా.. మీకోసం కార్యక్రమం
డిసెంబరు ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు