సరికొత్త చరిత్ర సృష్టించేందుకు జీఎస్టీ సంస్కరణలు సాయం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు.
జీఎస్టీ వచ్చాక అనేక రకాల పన్నుల నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతోందని పేర్కొన్నారు.
జీఎస్టీ సంస్కరణలతో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ సంస్కరణలతో ప్రజల పొదుపు పెరుగుతుందని వివరించారు.
జీఎస్టీ సంస్కరణలతో అన్ని వర్గాలవారికి లాభం కలుగుతోందని వెల్లడించారు.
అనేక రకాల ట్యాక్స్‌లతో వ్యాపారులు కూడా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు ప్రధాని మోదీ.
రేపటి నుంచి దేశంలో సంతోషాలు వెల్లివిరియనున్నాయని తెలిపారు.
అన్ని రకాల పన్నులను రద్దు చేసిన తర్వాత 2017లో జీఎస్టీ అమల్లోకి తీసుకువచ్చామని గుర్తుచేశారు ప్రధాని మోదీ.
జీఎస్టీ రాకముందు పన్నులు విధించి ఆటంకాలు కలిగించేవారని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ సంస్కరణలతో వస్తు, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని వివరించారు ప్రధాని మోదీ.
అన్నివర్గాలతో చర్చించి జీఎస్టీ సంస్కరణలను అమల్లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
నిత్యావసరాల వస్తువులపై ఐదు శాతం మాత్రమే పన్ను విధిస్తామని తెలిపారు.
నిత్యావసరాల వస్తువులపై 5 శాతం మాత్రమే పన్ను విధించామని ప్రధాని మోదీ తెలిపారు.
ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
హోటల్స్ సేవలపై కూడా జీఎస్టీ తగ్గించామని తెలిపారు.
12 శాతంలో ఉన్న 99 శాతం వస్తువులకు 5 శాతం పన్ను శ్లాబ్ ఉంటుందని వివరించారు.
కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని వివరించారు.
మధ్య తరగతికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్ బోనాంజా అని నొక్కిచెప్పారు ప్రధాని మోదీ.
దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోందని... జీఎస్టీ సవరణలు ఎంతో ప్రోత్సాహకరమని తెలిపారు.
పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని వివరించారు.
కొత్త జీఎస్టీతో ఆత్మనిర్భర్ భారత్‌కు మరింత ఊతమిస్తాయని వివరించారు ప్రధాని మోదీ.
సంస్కరణలు సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తాయని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.
జీఎస్టీతో వన్ నేషన్ వన్ ట్యాక్స్ స్వప్నం సాకారమైందని ఉద్ఘాటించారు.
జీఎస్టీ తగ్గింపుతో MSMEలు కూడా లాభపడతాయని చెప్పుకొచ్చారు.
దేశంలోకి చాలా విదేశీ వస్తువులు వచ్చాయని చెప్పుకొచ్చారు.
ప్రజలు మేడిన్ ఇండియా ఉత్పత్తులే వాడాలని దిశానిర్దేశం చేశారు ప్రధాని మోదీ.
దేశం సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడాలని సూచించారు.
మన ఉత్పత్తుల నాణ్యత దేశ గౌరవాన్ని మరింత పెంచుతోందని నొక్కిచెప్పారు.
నాగరిక్ దేవోభవన అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
జీఎస్టీ మార్పులతో రాష్ట్రాల అభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
Related Web Stories
Rahul Gandhi: సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
లక్ష కోట్ల కుంభకోణంకు కారణం వీళ్లే.. కవిత షాకింగ్ కామెంట్స్
AI చాట్‌బాట్‌తో జాగ్రత్త.. ఈ ప్రశ్నలు అడిగితే జైలుకే..!
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది?