పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. విశేషాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం (28-01-26) ప్రారంభమయ్యాయి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 

రెండో రోజు (గురువారం).. ఈ సమావేశాల్లో ఆర్థిక సర్వేని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొమ్మిదో సారి.. బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టనున్నారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.

ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు విడతల్లో జరగనున్నాయి. 

జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొదటి దశలో జరుగుతాయి.

మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో దశ సమావేశాలు జరుగుతాయి. 

ఈ సమావేశాల్లో బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ, ఇతర బిల్లులు ఆమోదంతోపాటు వివిధ అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.