బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు.

బీఆర్ఎస్, హరీష్‌‌రావు, సంతోష్‌ తనపై సోషల్‌ మీడియాలో దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం విషయంలో తప్పా హరీష్‌రావుపై తనకు వేరే కోపం లేదని స్పష్టం చేశారు.

తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని చెప్పుకొచ్చారు కవిత.

పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని గుర్తుచేశారు.

పార్టీ పెట్టేముందు ప్రస్తుతం తానూ కూడా పలువురితో చర్చిస్తున్నానని తెలిపారు. 

తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదని చెప్పుకొచ్చారు.

ఒక వర్గం కోసం  పనిచేయడం  కాదని.. ప్రజలందరి కోసం తాను పనిచేయాలనుకుంటున్నానని కవిత స్పష్టం చేశారు.

తండ్రి పార్టీ నుంచి సస్పెండయిన మొదటి కూతురినీ తానేనని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తాను ఫ్రీబర్డ్‌‌నని తెలిపారు.

తనకు కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదని.. తానెవరినీ సంప్రదించలేదని కవిత  తేల్చిచెప్పారు.

సీఎం రేవంత్‌‌రెడ్డి పదేపదే తన పేరును ఎందుకు తెస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు కవిత.

సీఎం రేవంత్‌‌రెడ్డినే కాంగ్రెస్  నుంచి బయటకు పోతున్నారేమోనని కవిత ఎద్దేవా చేశారు.

తన రాజీనామా అనుమతిని ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీదని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని  కవిత ఉద్ఘాటించారు.