వైసీపీపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలను బెదిరించి పంపేశారని ధ్వజమెత్తారు.
వైసీపీ పాలనలో పెట్టుబడిదారులకు ఏపీపై నమ్మకం పోయిందని చెప్పుకొచ్చారు.
సత్సంబంధాలు ఉంటేనే కంపెనీలు వస్తాయని.. కానీ బెదిరిస్తే పరిశ్రమలు రావని స్పష్టం చేశారు.
లాజిస్టిక్ యూనివర్సిటీ నిర్మించాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
ప్రపంచంలో నాణ్యమైన లాజిస్టిక్స్ ఏపీకి వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు.
తాము అధికారంలోకి వచ్చాక విశాఖ రైల్వేజోన్ పనులు ప్రారంభించామని ఉద్ఘాటించారు.
పోర్టులు - హార్బర్ల మధ్య రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.
దేశానికే మణిహారంగా గోల్డెన్ క్వాడ్రలేటరల్ ప్రాజెక్ట్ మారిందని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
హైవేల అంశంలో దేశంలో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు.
హైవేల్లో రూ.లక్షన్నర కోట్ల పనులు జరుగుతున్నాయని వివరించారు.
హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయని ప్రకటించారు.
నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధిపై ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
కార్గో రవాణాలో గుజరాత్ తర్వాత మనమే ఉన్నామని నొక్కిచెప్పారు.
కొత్తగా వచ్చే 4 పోర్టులతో రవాణా పెరుగనున్నదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
రవాణాకు ఇన్‌లాండ్
వాటర్ మార్గాలు వినియోగించుకుంటామని తెలిపారు.
2026 ఆగస్ట్ నాటికి విశాఖ ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.
సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పామని గుర్తుచేశారు.
ఏపీ రహదారుల అభవృద్ధికి రూ.600 కోట్లు కేటాయించామని ప్రకటించారు.
దేశంలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది తానేనని ఉద్ఘాటించారు
సీఎం చంద్రబాబు.
ఏపీకి 960 కిలోమీటర్ల సముద్రతీరం ఉండటం ఉపయోగకరమని వివరించారు.
జల రవాణా మార్గంలో సరుకు రవాణాకు చాలా తక్కువ వ్యయం అవుతుందని పేర్కొన్నారు.
రోడ్లను నిర్మించడమే కాదు.. వాటిని పర్యవేక్షించాలని సూచించారు.
తాము అధికారంలోకి వచ్చాక రోడ్లను బాగు చేయించామని తెలిపారు.
15 నెలల కూటమి పాలనలో 4.71 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Related Web Stories
Rahul Gandhi: సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
లక్ష కోట్ల కుంభకోణంకు కారణం వీళ్లే.. కవిత షాకింగ్ కామెంట్స్
AI చాట్‌బాట్‌తో జాగ్రత్త.. ఈ ప్రశ్నలు అడిగితే జైలుకే..!
ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న దేశం ఏది?