ఏపీ అభివృద్ధిపై  సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుంది

మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర, పవన, పoప్‌డ్డ్ స్టోరేజ్ విద్యుత్‌ను.. పూడిమాడకకు తెచ్చి తద్వారా హెడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం

ఉత్పత్తయ్యే హైడ్రోజన్‌తో ఎరువులు, రసాయనాలు తయారీ చేస్తాం.

హరిత ఇంధనం ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది

అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తికి హైడ్రోజన్ వాడితే వేడి బాగా తగ్గుతుంది

ఎన్టీపీసీలో బొగ్గు మండించటం ద్వారా వచ్చే కార్బన్‌ డైఆక్సైడ్‌ను.. పూడిమడక తెచ్చి హైడ్రోజన్ ఉత్పత్తికి వాడితే కాలుష్యం తగ్గుతుంది

సౌర విద్యుత్ ఉత్పత్తిపై కొత్త ఆలోచనలు చేస్తున్నాం

ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నాం

మిగిలిన వారికి కూడా సౌర ఫలకాల ఏర్పాటుకు కేంద్ర రాయితీ పోను మిగిలిన ఫలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది.

ప్రభుత్వ పెట్టుబడి తిరిగి వచ్చే వరకూ కొంత మొత్తం విద్యుత్ వెనక్కి తీసుకుంటాం