‘జెండా’ సభలో జగన్‌పై చంద్రబాబు ఫైర్

ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసేలా వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డ చంద్రబాబు

స్వార్థ పాలన కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారని జగన్‌పై ఫైర్ అయిన చంద్రబాబు

ఏపీని నెం.1 స్థానంలో నిలబెట్టాలనేదే సంకల్పమని, తెలుగు జాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేదాకా విశ్రమించమని చెప్పిన చంద్రబాబు

జగన్‌ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళి లాంటి వ్యక్తుల్ని అవమానించారన్న చంద్రబాబు

వైసీపీ దొంగలపై యుద్ధం చేయాలి, అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని యువతకి పిలుపునిచ్చిన చంద్రబాబు

ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్‌.. ఎన్నికల తర్వాత జర్నలిస్టులపై పిడిగుద్దులు కురిపిస్తున్నాడని తూర్పారపట్టిన చంద్రబాబు

జగన్‌ ఒక బ్లఫ్‌ మాస్టర్‌. హోదా తెస్తామన్న హామీ ఏమైంది? మద్యపాన నిషేదం, సీపీఎస్‌ రద్దు ఏమైంది? అని ప్రశ్నించిన చంద్రబాబు

ఏపీలో సైకో పాలన నడుస్తోంది, త్వరలో రాష్ట్రానికి నవోదయం, భవిష్యత్‌కు నాంది పలకాల్సిన బాధ్యత మనపై ఉందన్న చంద్రబాబు

పేదల కోసం పెట్టిన అన్నా క్యాంటీన్లను మూసివేసిన దుర్మార్గుడు జగన్‌ అని విరుచుకుపడిన చంద్రబాబు