తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్‌కి ఆహ్వానం

తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరారు

ఖమ్మం, నల్లగొండ, భువనగిరిలో ఒకటి ఎంచుకోవాలని ప్రతిపాదన

గత ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి ఎన్నికైన రాహుల్‌. ఆ స్థానం కోసం మిత్రపక్షం సీపీఐ ఒత్తిడి

అక్కడ సీపీఐ కూడా పోటీకి దిగడంతో ప్రత్యామ్నాయ సీటు కోసం రాహుల్ అన్వేషణ

ఈ క్రమంలో తెలంగాణలో పోటీ చేయాలంటూ రేవంత్ ఆహ్వానం. రాహుల్ స్పందనపై ఆసక్తిగా కాంగ్రెస్ నేతలు