రూ.500 లకే గ్యాస్ పథకానికి  తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే.

ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి ఇది వర్తిస్తుంది.

మూడు సంవత్సరాలు గ్యాస్ వినియోగం ఆధారంగా సబ్సిడీ ఇస్తారు.

వినియోగదారులు తొలుత మొత్తం డబ్బు చెల్లించి గ్యాస్ కొనుగోలు చేయాలి.

48 గంటల్లోగా సబ్సిడీ డబ్బు వినియోగదారుల అకౌంట్‌లో పడుతుంది.

ఈ సబ్సిడీని ప్రభుత్వం OMC సంస్థలకు వేస్తే.. ఆ సంస్థలు వినియోగదారుల అకౌంట్‌లో వేస్తాయి.

భవిష్యత్తులో వినియోగదారులు కేవలం రూ. 500 చెల్లించేలా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.

ఈ పథకాన్ని జిల్లాల కలెక్టర్లు మానిటరింగ్ చేస్తారు.

ప్రజాపాలనలో అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా 39.5 లక్షల లబ్ధిదారులను గుర్తించారు.